చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాకు సంబంధించి నాన్-థియేట్రికల్ బిజినెస్ మేటర్స్ బయటకొచ్చాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది. ఇప్పుడీ రెండు డీల్స్ కు సంబంధించిన ఎమౌంట్స్ బయటకొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ సంస్థ 29 కోట్ల రూపాయలకు దక్కించుకుందట. అయితే ఈ డీల్ కేవలం తెలుగు శాటిలైట్ కు మాత్రమే పరిమితం కాదు. టోటల్ సౌత్ 4 భాషలకు చెందిన శాటిలైట్ రైట్స్ ను ఈ మొత్తానికి సదరు ఛానెల్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను 25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆచార్య సినిమాకు సంబంధించి ఫస్ట్ కుదిరిన డీల్ ఇదే. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, ఆడియో రైట్స్ కంటే ముందు అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది.
చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్నాడు ఆచార్య.