మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇక మెగా స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రిలీజ్ అయ్యింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం… అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ మెగాస్టార్ యాక్షన్ ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.
మరోవైపు పాఠాలు చెప్పే అలవాటు లేకున్నా అందరూ ఆచార్య అంటుంటారు… బహుశా గుణపాఠాలు చెబుతాననేమో అంటూ మెగాస్టార్ కూడా తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. ఇక మొత్తంగా మెగా అభిమానులకు ఆచార్య నుంచి విడుదలైన ఈ టీజర్ మంచి జోష్ ని ఇచ్చిందని చెప్పాలి.