టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయడు కింద పడిపోయారు. సర్దార్ గౌతు లచ్చన్న పేరుతో పోస్టల్ స్టాప్ విడుదల కార్యక్రమంలో ఇది జరిగింది. స్టేజ్ పై ఎంపీ రామ్మోహన్ కూర్చుని ఉండగా.. అప్పుడే అక్కడకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అందరికీ అభివాదం చేస్తూ సోఫాలో కుర్చున్నారు. ఆ వెంటనే సోఫా వెనక్కి వాలిపోయింది. బాబాయి, అబ్బాయిలిద్దరూ పడిపోయారు.
గన్‌మెన్లు, చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఇద్దర్నీ పైకి లేపారు. త తర్వాత పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది. ఈ సంఘటనలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి గాయాలూ కాలేదు.