అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్ కు ఉందా..? పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు ఖూనీ చేశారు. అందుకే మేము ఆ ఎన్నికలను బహిష్కరించాం. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం కోసం అక్రమ కేసులు బనాయించారు అధికార పార్టీ నేతలు.
వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేశారో దేశం మొత్తం చూసింది. ఏపీలో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోంది. పరిషత్ ఎన్నికలు ముమ్మాటికీ ప్రజాభిప్రాయం కాదు. అధికారులతో పాటు పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరించారు.