అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి వికృత క్రీడ మొదలు పెట్టారు. ఈ ఆటలో పోసాని కృష్ణమురళి పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్. వైసీపీ నేతలు మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతుల్లా మాట్లాడతారా..? పవన్ విషయంలో పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి భాషను వాడి సంస్కృతీ సంప్రదాయాలను మంటగల్పుతారా..?
ధరలు పెరుగుదల, దోపిడీ విషయాల్లో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు ఆపడం లేదు..? వైసీపీ నేతలు ప్రజలు వినలేని భాషలో మాట్లాడుతుంటే సంతోష పడుతున్నారా..?