అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చారు.
టీడీపీ నేతల అరెస్టులు, అక్రమ నిర్బంధాలు తప్ప ఏం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు?
రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు.
పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు. అక్రమ అరెస్టుల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదు.