అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
విభజన అంశాలపై నియమించిన ఉపకమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. తర్వాత తొలగించడం వైసీపీ అసమర్థతకు నిదర్శనం. ఆపార్టీ నేతల లోపాయికారీతనం దీంతో బట్టబయలైంది.
తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా ప్రత్యేక హోదా మాట వినిపించకుండా నిషేధం విధించారు. సీఎం జగన్ రాష్ట్రానికి హోదా విషయంలో ఆస్కార్ అవార్డుకు మించి నటిస్తున్నారు. అందుకే ఆయనకు ‘మోసకార్’ అవార్డు తప్పక ఇవ్వాల్సి ఉంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో ప్రత్యేక హోదా అంటూ డ్రామాలు ఆడింది ఎవరు?. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు?. జగన్ ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు కిమ్మనడం లేదో తెలిసిన విషయమే. కేసుల మాఫీ కోసం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను అమ్మేశారు.
ఆనాడు టీడీపీ హయాంలో రాద్దాంతం చేసి ఇప్పుడు గమ్మున ఎందుకు ఉంటున్నారో ప్రజలకు అర్థం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.