ఏలూరులో అంతులేని వ్యాధితో జనం పడిపోతున్నారు. జనం అంతా సొమ్మసిల్లిపడిపోతుండటంతో… ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అయితే, ఇది ఏ కారణం చేత జరుగుతుందన్నది మాత్రం అధికారులెవరూ నిర్ధారించలేదు.
తాజాగా దీనిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. తక్షణమే సురక్షిత మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.
5 రోజుల నుంచి కలుషిత నీరు వస్తుందని చెప్పినా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.
దీంతో కలుషిత నీటితోనే ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న అంశం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.