మహిళలపై దాడుల నియంత్రణకు ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ ఇంటర్ సెకండియర్ విద్యార్ధినిపై యాసిడ్ దాడి జరిగింది. పెందుర్తి బాలాజీ జూనియర్ కాలేజీలోనే ఈ సంఘటన జరిగింది. పెందుర్తిలోని ఎన్.ఎ.డి జంక్షన్ లోని చైతన్య కాలేజీలో బాధితురాలైన అమ్మాయి, యాసిడ్ దాడి చేసిన అబ్బాయి ఇద్దరూ చదువుతున్నారు. బాలాజీ కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్ధినిపై తోటి విద్యార్ధి యాసిడ్ పోశాడు. యాసిడ్ మీద పడడంతో ఆ అమ్మాయి దుస్తులు కాలిపోయాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.