కావాలనే సీ సెక్షన్ డెలివరీలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని పెట్లబురుజు ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బెడ్స్ పెరుగుదల, స్టాఫ్ పెంచడం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు.
రిస్క్ ఉన్న తల్లిని డెలివరీ డేట్ కంటే ముందుగానే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు సూచించారు. పేషెంట్లను మీ కుటుంబ సభ్యులుగా భావించండని వైద్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేషెంట్లను నిర్లక్ష్యం చేయకూడదని, జనం ఇచ్చే డబ్బు నుంచే మీకు జీతాలు వస్తున్నాయని తెలిపారు.
నార్మల్ డెలివరీ కోసం ప్రెగ్నెన్సీ ఉమెన్ కి వ్యాయామాలు చేయిస్తున్నామన్నారు. సెక్షన్స్ తగ్గించమని చెబుతుంటే, రివర్స్ లో చేస్తున్నారన్నారని అన్నారు. సీ సెక్షన్స్ లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని గుర్తు చేశారు. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పమని డాక్టర్లను మంత్రి అడిగారు.
4 లక్షల మంది గర్భవతులకు న్యూట్రిషన్ కిట్స్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం మదర్ మోర్టాలిటి రేటులో 3వ స్థానంలో ఉన్నామని, భారత సరాసరి కంటే బాగున్నామని, కానీ ఫస్ట్ ప్లేస్ కి రావాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ లో ఇన్ఫెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశామని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కి కూడా నిధులు ఉన్నాయని, వాటిని కూడా వాడండని ఆదేశించారు మంత్రి హరీష్ రావు.