విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు విడుదల అయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఆయనకు తాత్కాలిక విముక్తి లభించింది. జైల్లో ఉన్న కాలంలోనే అనారోగ్యం కారణంగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావుకు బెయిల్ మంజూరు కావడంతో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో డిశ్చార్జి చేశారు.భీమాకోరేగావ్ కేసులో అరెస్టయి రెండున్నరేళ్లుగా మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉంటున్నారు వరవరరావు. ఈక్రమంలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో పోలీసులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత గత నెల 22న ముంబై హైకోర్టు ఆయనకు 6 నెలల పాటు బెయిల్ ఇచ్చింది. కానీ అప్పటికీ ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో నానావతి ఆసుపత్రిలోనే ఉండి వరవరరావు చికిత్స తీసుకున్నారు..
వరవరరావుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ముంబై హైకోర్టు పలు షరతులు విధించింది. ఈ 6 నెలల పాటు ఆయన ముంబై విడిచివెళ్లరాదని తెలిపింది. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ముంబైలోనే ఒక ఇంటిలో ఉండనున్నారు వరవరరావు.