ప్రముఖ నిర్మాత నటుడు అశోక్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వసుంధరాదేవి సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. అశోక్ కుమార్ విషయానికొస్తే కోడిరామకృష్ణ దర్శకత్వం వచ్చిన భారత్ బంధు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అశోక్ కుమార్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నారు.
రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించారు. అశోక్ కుమార్ తల్లి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.