రేసుగుర్రం విలన్ మద్దాల శివారెడ్డి… మనందరికి గుర్తుండే ఉంటారు కదా. ఈ భోజ్‌పురి నటుడు రవికిషన్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బీజేపీ ఎంపీగా ఆయన తన పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పేరు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
ఎందుకంటే ఆయన జనాభా నియంత్రణ పై లోక్ సభలో ప్రైవేటు బిల్లు తీసుకొస్తాననడం ఇప్పుడు పెద్ద చర్చానీయాంశమైంది. దానిపై సోషల్ మీడియాలో ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది.అసలు ఆ బిల్లు ఏంటంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మందిని కనకూడదన్నది ఆ బిల్లు ఉద్దేశం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాభా నియంత్రణ అనేది చాలా ముఖ్యం. నేను ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. ఎందుకు ప్రవేశ పెట్టాలనుకుంటున్నానో వినండి అంటూ రవికిషన్ పేర్కొన్నారు.
కానీ ఇక్కడ జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టాలనుకున్న రవికిషన్ కు ఏకంగా నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. నలుగురు పిల్లల తండ్రి అయిన బీజేపీ ఎంపీ గారు ఈ బిల్లు ప్రవేశపెడతాననడం ఎంతో హాస్యస్పదంగా ఉందంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
ముందు నీ సంగతి చూసుకుని తర్వాత జనాభా నియంత్రణ గురించి మాట్లాడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.