కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దేశంలో పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. తినటానికి తిండి కూడా ఆకలి చూపులు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది. దానికి తోడు మరో సారి లాక్ డౌన్ పొడిగించే యోచనలో కేంద్రం కనిపిస్తుంది.
ఇలానే లాక్ డౌన్ పెంచుకుంటూ పోతే తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటూ, చేతిలో చిప్ప పట్టుకుని కూర్చున్న తన పాత ఫొటోను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది..” అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.