తెలుగు సినిమా అభిమానులకు యాక్టర్ బ్రహ్మాజీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలో కనిపించి ఆయన అభిమానులను అలరించారు.
ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి సినిమాలో కనిపిస్తున్న… బ్రహ్మాజీ కరోనా లాక్ డౌన్ నుండి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. దాదాపుగా 2 లక్షల ఫాలోవర్లను కలిసాగి ఉన్న బ్రహ్మాజీ వరుస పోస్టులు పెడుతూ.. అభిమానులను అలరిస్తూ వస్తున్నారు బ్రహ్మాజీ.
ఇక తాజాగా ఆయన పెళ్లి రోజు సందర్భంగా బ్రహ్మాజీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ… నా భార్య ఈ ప్రపంచంలోనే అందరికంటే అందమైన వ్యక్తిని మరియు ధైర్యవంతుడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు కొంత జెలసీగా ఉంది” అంటూ ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ పోస్ట్ పైన అభిమానులు స్పందిస్తూ…బ్రహ్మాజీ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తన స్టైల్ లో చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్రహ్మాజీ గారు కెరియర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించిన.. ఇప్పుడు ఆయనకు ఎక్కువగా కామెడీ పాత్రలే వస్తున్నాయి. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఈయన.. యాంకర్ సుమ కలిస్తే చాలు.. నవ్వులే నవ్వులు. ఇక ఈ మధ్యే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కుమార్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. కరోనా లాక్ డౌన్ కు ముందు మర్చి 6న అతను నటించిన ఓ పిట్ట కథ అనే సినిమా అభిమానుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అహాన్ని నుండి మరో సినిమా రాలేదు.
Also Read:
సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న 5 టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసా ??