తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కొంతమంది హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అది అలా ఉంటే ధనుష్ తాజాగా తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్.. తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడే నివసించాలనుకున్నారట ధనుష్. అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఈ జంట విడిపోక ముందు ఈ ఇంటిని స్టార్ట్ చేశాడు ధనుష్.
ఇంటి పనులు పూర్తవ్వడంతో తాజాగా ఆయన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లైన 18 సంవత్సరాలకు ఈ జంట విడిపోయారు.
ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేశారు ధనుష్. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో వస్తుంటే.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 17నవిడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో తెలుగులో 20 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగులో ఈ సినిమా ఏపీ తెలంగాణలో కలిపి 5.5 కోట్ల వాల్యూ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 6 కోట్ల షేర్ సాధించాలి. తమిళ్‌లో మాత్రం 35 కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 415 థియేటర్స్‌లో విడుదలైంది.