నటి గాయత్రి భార్గవి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. అలాగే సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. తన అకౌంట్ నుంచి ఇతర మతాలకు చెందిన అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు వివరించింది.
గాయత్రి అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేయడమే కాకుండా… ఆమె పేరుపై మరో ఖాతాను క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఏసీపీ కేవీఎం ప్రసాద్.
ఇక తన ఫేస్ బుక్ ద్వారా ఎలాంటి మెసేజ్ లు, పోస్టులు వచ్చినా దయచేసి స్పందించవద్దని నెటిజన్లను కోరింది గాయత్రి భార్గవి.