సినీ నటి హేమకు సినిమాల్లో ఎంత పాపులారిటీ వచ్చిందో గాని బయట విషయాలతో మాత్రం ఆమె బాగా పాపులర్ అయ్యారనే మాట వాస్తవం. అగ్ర నటుల సినిమాల్లో మంచి పాత్రలు చేసిన ఆమె సినిమా పరిశ్రమ రాజకీయాల్లో కూడా కాస్త ప్రభావం చూపించారు. మా ఎన్నికల సమయంలో ఆమె చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆమె తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
తన భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ అని తెలిపారు. తాను పూరీ జగన్నాథ్ దగ్గర పని చేసేదానినని చెప్పిన ఆమె అదే సమయంలో ఆయన వచ్చేవారని అన్నారు. తాను ఒకసారి ఎగ్జిబిషన్ కు వెళుతుంటే ఆయన వచ్చారని అక్కడ కలిశానని చెప్పుకొచ్చారు. ఎగ్జిబిషన్ కు వెళ్లే సమయంలో ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారని… ఆ సమయంలో పెళ్లి గురించి చెప్పడంతో మోసం చేయడని అనిపించిందని చెప్పుకొచ్చారు.
కొన్ని రోజులకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇంట్లో తెలిసిందని మా అమ్మ సీరియస్ అయిందని చెప్పుకొచ్చారు ఆమె. 18 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగిందని ఆ తర్వాత ఇంట్లో చెప్పామన్నారు. పెళ్లి తర్వాత నేను మా ఇంట్లోనే ఉన్నానని నా భర్త ముస్లిం అని అతను తలాఖ్ చెప్పకూడదని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకున్నామని వివరించారు.