సీనియర్ హీరో జగపతి బాబు దుబాయ్ సబర్బన్ ప్రాంతంలో దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ…ఓ విషయాన్ని కూడా పంచుకున్నారు. వాస్తవానికి జగపతి బాబు ఒకానొక సమయంలో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు.
తన తండ్రి ఇచ్చిన రాజభవనాన్ని కూడా విక్రయించాడు. తన సినిమాలు కూడా ఆడకపోటం తో అప్పుల ఊబిలో కూరుకుపోయి డిప్రెషన్ లోకి వెళ్ళాడు.
చివరగా ‘విలన్’ మరియు ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా దిగాడు. రంగస్థలం, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు దాదాపు ₹ 1 కోట్లు వసూలు వస్తున్నాడు. కాగా ఇప్పుడు బాగా సంపాదిస్తున్నందున, దుబాయ్‌లో ప్రపంచ స్థాయి బ్రాండ్‌లను షాపింగ్ చేస్తున్నాడు.
ఇదే విషయాన్ని చెబుతూ సో, డబ్బులు లేకపోతె ఒక గోల..ఉంటే ఓకే గోల! అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు.