సినీ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు.
శ్రీనివాస్ 40కి పైగా సినిమాలలో 10కిపైగా టీవీ సీరియళ్లలో నటించాడు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నచ్చావులే, ప్రేమకావాలి వంటి సినిమాలు శ్రీనివాస్ కు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇక శ్రీనివాస్ కు తల్లి మాత్రమే ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోయారు. తమ్ముడు పదేళ్ల కిందట చనిపోయాడు. అక్క చెల్లెలు ఉన్నప్పటికీ వారి పెళ్లిళ్లు అయిపోయాయి.
ఇటీవల షూటింగ్ సమయంలో శ్రీనివాస్ గాయపడటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు ధృవీకరించారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు శ్రీనివాస్.