సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనపై స్పందించిన తీరు పట్ల హీరో మంచు మనోజ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాపై సెటర్ వేశారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో.. ఓ ఛానెల్ రిపోర్టర్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడు. దారుణాన్ని ఎలా చూస్తున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారని అడగ్గా… ఆయన ఊహించని సమాధానం ఇచ్చారు.
మీడియా ఇలాంటి ఘటనలపై ఫోకస్ చేస్తే.. ఇతరుల్లోనూ చైతన్యం వస్తుందని మనోజ్ అన్నాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వంటి విషయాలపై కాకుండా.. వీటిపై దృష్టిసారిస్తే బాగుంటుందని అన్నాడు. దీంతో రిపోర్టర్ మరో ప్రశ్న వేయలేకపోయాడు. ఇక బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి పట్ల జరిగింది అత్యంత క్రూరమైన చర్య అని చెప్పారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలని కోరారు.