టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ అంశాన్ని ప్రధానంగా విచారిస్తున్న ఈడీ అధికారులు రోజుకొకరిని విచారిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లను విచారించారు. తాజాగా ఈడీ ముందుకు నటుడు నందు హజరయ్యారు.
నిజానికి ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం నందు ఈ నెల 20న విచారణకు హజరు కావాల్సి ఉంది. కానీ నందు తనను ముందుగా విచారించాలని విజ్ఞప్తి చేయగా… ఈడీ అంగీకరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.