సినీ నటులు నరేష్, పవిత్రలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ పై నరేష్, పవిత్ర కేసు నమోదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే పవిత్ర, నరేష్ లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు పవిత్రా లోకేష్. అనంతరం తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే కొంతకాలం నుంచి పవిత్ర, నరేష్ తో కలిసి ఉండటం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం సాగింది. వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఓ సారి నరేష్ మూడో భార్య ఎంట్రీ ఇచ్చి గొడవ చేయడం అంతటా రచ్చ రచ్చగా మారింది.
నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్ గదిలో ఉండగా.. నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమ్య.. నరేష్, పవిత్రలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత వీరి వ్యవహారంపై మీడియాలో భారీగానే కథనాలు వచ్చాయి.