యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు ఫుల్ బిజీబిజీగా మారిపోయాడు. 2023వరకు ప్రభాస్ కాల్ షీట్స్ అస్సలు ఖాళీ లేవంటే తను ఎంత బిజీయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్న ప్రభాస్… రాముడిగా కనిపించనున్నాడు.
అయితే, ఆదిపురుష్ తో పాటు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ మూవీ కూడా చేస్తున్నాడు. అయితే, రాముడి గెటప్ లో ఒకేలా కనిపించేలా జాగ్రత్తగా ఉండాలని ఎన్నో సార్లు ప్రభాస్ ను డైరెక్టర్ హెచ్చరించాడట. కానీ ఇటీవల తన బాడీలో వచ్చిన మార్పులతో అప్సెట్ అయిన డైరెక్టర్… వరల్డ్ ఫేమస్ డైటిషన్ దగ్గరకు పంపినట్లు తెలుస్తోంది. అందుకోసం బ్రిటన్ కు పంపినట్లు ఆదిపురుష్ చిత్ర యూనిట్ అనధికారికంగా చెప్తోంది.