తమిళ నటుడు ప్రభు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ, వచ్చిన ప్రతి పాత్రను తనదైన రీతిలో ప్రేక్షకులు మెచ్చేలా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో బిజీ యాక్టర్‌గా మారాడు. ఇక తండ్రి పాత్రల్లో ప్రభుకి మంచి క్రేజ్ ఉంది.
అయితే ఈ యాక్టర్ తాజాగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కడుపులో నొప్పి కారణంగా ప్రభు చెన్నైలోని మెడ్వే ఆసుపత్రిలో ఫిబ్రవరి 20న జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. డాక్టర్లు ఆయన కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లుగా గుర్తించారని.. లేజర్ ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన్ను త్వరలోనే డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
ప్రభు ఆసుపత్రిలో చేరారనే వార్తతో ఒక్కసారిగా కోలీవుడ్ షాక్‌కు గురికాగా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకుని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.