సినీనటుడు ప్రకాష్ రాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలో ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ట్విటర్ వేదికగా తాను గాయపడిన విషయాన్ని ప్రకాష్ రాజు వెల్లడించారు.
కిందపడ్డాను. చిన్న ఫ్యాక్చర్ అయింది. హైదరాబాద్ వస్తున్నాను. నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేస్తారు. అభిమానులు ఆందోళన చెందవద్దు. అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు.