మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వాతావరణం మారుతుంది. పోటీలో నిలుచుంటున్న వారు ఒకరి పై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కాగా అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ లు ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించారు.
ఇక తాజాగా విష్ణు ప్యానల్ కు సంబంధించి ఓ నటుడు పేరు వినిపిస్తుంది. అది మరెవరో కాదట… నటుడు రఘుబాబు. రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్ నుంచి పోటీలోకి దిగుతున్నారట. ఈ మేరకు ఆయన జనరల్ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారట. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ పడతున్నారు.