రానా దగ్గుపాటి హెల్త్ కి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రానా కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ వార్తలపై రానా క్లారిటీ ఇచ్చాడు.
‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నాడు రానా. బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా బయట పెట్టాడు. తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆరోగ్య సమస్యలపై క్లారిటీ ఇచ్చాడు.
రానా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు కుడి కన్ను అస్సలు కనిపించదు అని తెలిపాడు. అదే విధంగా కిడ్నీ సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాను.. ఆ రెండింటికి శస్త్ర చికిత్స చేయించుకున్నానని చెప్పాడు రానా.
అయితే చాలా మందికి శారీరక సమస్యలు వస్తే బాధపడతారు.. సమస్యలు తొలగిపోయినప్పటికీ వాటిని తలుచుకుంటూనే ఉంటారు.. నాకు అదే విధంగా జరిగింది. కానీ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రతీ ఒక్కరు కెరీర్ లో ముందుకెళ్లాలని అంటూ చెప్పుకొచ్చాడు రానా. దీంతో రానా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.