బాలీవుడ్ జంట రణవీర్ సింగ్ , దీపికా పడుకొణే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాకుండా వీరి ఇంటికి దగ్గర్లోనే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఉంటున్నారు. అంటే ఇప్పుడు షారూక్, సల్మాన్, దీపికా లు ఇరుగుపొరుగు వారు అనమాట….
వివరాల్లోకి వెళ్తే… ముంబైలోని బాంద్రాలని లష్ రెసిడెన్షియల్ టవర్ సాగర్ రేషమ్‌లో సీ- వ్యూ అపార్ట్ మెంట్ క్వాడ్రప్లెక్స్‌ని ఈ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాని ఖరీదు రూ.119 కోట్లుగా వినికిడి. ప్రస్తుతం దీపికా, రణవీర్ కొనుగోలు చేసిన అపార్టమెంట్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్, షారూక్ ఖాన్ మన్నత్ బంగ్లాల మధ్య ఉంది. దాంతో వీరిద్దరూ దీపికా రణవీర్ లకు ఇరుగుపొరుగు అవుతున్నారు.
ఇది మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతం, 1300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రస్‌ను కలిగి ఉంది. రణవీర్ తండ్రి జుగ్గీత్ సుందర్ సింగ్ భవ్నానీ, రణవీర్ డైరక్టర్లుగా ఉన్న ఓహ్‌ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ ద్వారా ఈ ఇంటిని కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్ కోసమే ఈ జంట రూ.7.13 కోట్లను ఖర్చు పెట్టింది.
గతేడాది సెప్టెంబరులో దీపికా పడుకొణె, ఆమె భర్త రణవీర్ సింగ్ అలీబాగ్‌లో రూ. 22 కోట్లతో ఒక ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారడంతో అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.