తెలుగు సినిమాలో కొందరు యువ నటులు మంచి పేరు సంపాదించారు. వచ్చిన అవకాశాలను అన్ని విధాలుగా వాడుకుంటూ నిలబడ్డారు. ఏ పాత్ర వచ్చినా సరే కాదు అనకుండా మంచి సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. అందులో యువ నటుడు రవి వర్మ ఒకరు. ఒకరకంగా ఆయన టాలీవుడ్ లో సీనియర్ అనే చెప్పాలి. ఇక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాను చేసిన నెగిటివ్ రోల్స్ ఏ స్థాయిలో పాపులర్ చేశాయో నన్ను అంటే లిమిట్ చేశాయని నాకు అనిపిస్తుందని ఆయన వివరించారు. రాఖీ సినిమాలో నటించడం వల్ల ప్రతి ఒక్కరూ నన్ను సులువుగా గుర్తు పడతారని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తు పడతారంటే ఆ సినిమానే కారణమని అన్నారు. కృష్ణవంశీ గారు పది రకాలుగా చేయమని అడిగేవారని అన్నారు.
కథ, కథనంకు ఏది బాగుంటుందని ఆయన ఆలోచిస్తారని వివరించారు. కృష్ణవంశీ నుంచి తాను పది వేరియేషన్స్ తెలుసుకుంటే అన్నీ గుర్తు పెట్టుకోవాలని తెలుసుకున్నానని పేర్కొన్నారు. తాను చేసిన పది నెగిటివ్ రోల్స్ మంచి రోల్స్ అయ్యాయని, రాఖీ చేసిన తర్వాత ఐదేళ్లు నేను సినిమాల్లో లేనని వివరించారు. నక్షత్రం సినిమా సమయంలో తాను కృష్ణవంశీ గారిని కలిశానని వివరించారు. అమెరికాకువెళ్లకుండా ఉండి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని తెలిపారు.