తిరుమల శ్రీవారిని నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు.ఉదయం విఐపి విరామసమయంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ లో రియల్ హీరోలైన పోలీసులతో కలసి గెస్ట్ గా పాల్గొనడం జరిగిందన్నారు. తాను నటించిన పోలీస్ స్టొరీ చిత్రం 25 సంవత్సరాల పూర్తి చేసుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు.అదే విధంగా తెలుగు,కన్నడ చిత్రాల్లో కూడా సాయి కుమార్ నటిస్తున్నట్లుగా సాయి కుమార్ చెప్పారు.