తెలుగులో మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న బ్యూటీ సాయిపల్లవి. ఆమె చేసిన సినిమాలు అన్ని కూడా హిట్ టాక్ నే సొంతం చేసుకున్నాయి.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాయి పల్లవి గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఇక సినిమాలకు స్వస్తి చెప్పనుందని, వైద్యురాలిగా స్థిరపడనుందని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసం ఒక ఆస్పత్రిని కూడా నిర్మించే పనిలో ఉందని పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టులకు కూడా సైన్ చేయలేదు. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కించే చిత్రంలో అవకాశం వచ్చినా తిరస్కరించిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కారణంగానే న్యాచురల్ బ్యూటీ సినిమా రంగానికి వీడ్కోలు పలుకుతుందంటూ రకరకాల వదంతులు వస్తున్నాయి.
తాజాగా వీటిపై స్పందించిన సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని అసలు ఊహించలేదు. ఆ చిత్రంలో టీచర్ ఇమేజ్‌ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను’
‘నేను ఎంబీబీఎస్ చదివినా నటిని కావాలనుకున్నాను. దీనికి మా అమ్మానాన్నలు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు .నేను నటించిన చిత్రాలు, పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా భావించడం సంతోషంగా ఉంది. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో సినిమాలకు గుడ్‌డై చెప్పనుందంటూ ఆమెపై వస్తోన్న వార్తలు అసత్యమేనని తేల్చిపారేసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సాయి పల్లవిని మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.