మధురై వృద్ధ దంపతులకు సినీ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజన్ లీగల్ నోటీసులు పంపారు. వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్టు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
మధురై దంపతులు కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ధనుష్ తమ రక్తం పంచుకుని పుట్టిన కుమారుడని మధురైకి చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు ఆరోపణలు చేస్తున్నారు. సినిమాల్లో నటించాలనే కోరికతో ధనుష్ ఇళ్లు విడిచి పారిపోయారని ఆ దపంతులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం తమకు వయోభారం మీదపడిందని, జీవనాధారం కోసం రూ. 60వేలు తమ కొడుకు ధనుష్ నుంచి ఇప్పించాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఈ మేరకు హీరో ధనుష్‌కు హైకోర్టు సమన్లు పంపింది.