ప్రముఖ నటుడు శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారు. దీనితో కుటుంబసభ్యులు స్థానిక స్టార్ ఆస్పత్రికి తరలించారు. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారని తెలియటంతో సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. బీపీ లెవల్స్ పడిపోవడంతోనే శివాజీ రాజాకు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారని ఆయన సన్నిహితులు వివరించారు.
అంతేకాకుండా ఆయనకు స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 24 గంటల పాటు వైద్యుల ప్రత్యేక పరిశీలనలో ఉంటారని పేర్కొన్నారు. ఇక శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆయన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
.
.