తెలుగులో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోను సూద్. రీల్ లైఫ్ లో విలన్ అయినా… రియల్ లైఫ్ లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సోను సూద్.
సెలబ్రిటీలంతా ఇంట్లో ఆట విడుపుతో ఎంజాయ్ చేస్తూ… భౌతిక దూరం పాటించాలి, జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పే వారున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమకు తోచిన సహాయాన్ని ప్రభుత్వాలకు అందజేస్తున్నారు. అయితే… అంతటితో సరిపెట్టకుండా ఈ రీల్ లైఫ్ విలన్ వలస కూలీలకు సహయం చేస్తున్నారు.
సొంతూరికి వెళ్లిపోయేందుకు కూలీలంతా నడిచి వెళ్తున్న వారిని గమనించి, వారి ఆహారం ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దగ్గరుండి మరీ సొంతూరికి పంపించాడు. దీంతో సెలబ్రిటీలంతా సోను సూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Proud of my friend @SonuSood .. organising n sponsoring buses to take migrants back to their homes. Pandemic times also show us who we should continue being friends with ♥️ pic.twitter.com/Y5ykPzfhB8
— Farah Khan (@TheFarahKhan) May 12, 2020