నాలుగు రోజుల పాటు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇండ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా విదేశాల నుండి నిధులు వచ్చాయన్న ఆరోపణలతో 20కోట్లకు లెక్కలు లేవని అధికారులు తేల్చారు. కరోనా సమయంలో తను ఎన్నో సేవలు చేస్తే ప్రభుత్వాలు ఇచ్చే గిఫ్ట్ ఇదా అని పలువురు ప్రశ్నించారు.
తాజాగా నాలుగు రోజుల సోదాలపై సోనూసూద్ స్పందించారు. తను ఎలాంటి తప్పు చేయలేదని, ఐటీ అధికారులు అడిగిన అన్ని వివరాలతో పాటు డాక్యుమెంట్స్ ఇచ్చానన్నారు. ఇంత పర్ ఫెక్ట్ గా డాక్యుమెంట్స్ ఎప్పుడూ ఎక్కడా చూడలేదని ఐటీ అధికారులే అన్నారన్నారు.
తను రాజకీయాల్లోకి వస్తున్నానన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. తనకు గతంలో రెండుసార్లు రాజ్యసభ ఆఫర్స్ వచ్చాయని… కానీ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్నారు. వీలైనంత ఎక్కువ మందికి సహయం చేయటంపైనే ఇప్పుడు తన దృష్టంతా అంటూ స్పష్టం చేశారు.