హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆస్పత్రిని సినీ నటుడు సోనూసూద్ బుధవారం సందర్శించారు. సోనూ సూద్ కు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వాగతం పలికారు. ఆ తర్వాత క్యాంపస్ ప్రధాన ద్వారం ఎదుట సోనూసూద్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లు కలిసి సంపంగి మొక్కను నాటారు.
అనంతరం ఆస్పత్రిలోని కాటేజిస్, భోజన శాల, యోగా ప్రాంగణాలను సోనూసూద్ పరిశీలించారు. రోగులకు వైద్యులు అందిస్తున్న ట్రీట్ మెంట్, డైట్ ను అడిగి తెలుసుకున్నారు.
నేచర్ క్యూర్ ఆస్పత్రిలో సహజ ప్రకృతిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ ల పని తీరును అభినందించారు సోనూ సూద్.
ఈ కార్యక్రమంలో ఆయుష్ కమిషనర్ శ్రీమతి ప్రశాంతి, నేచర్య కూర్ వైద్యులు, సిబ్బంది, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ సివిల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.