సోనూసూద్. లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా… ఉన్నంతలో తను సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు. వలస కార్మికులకు ఆయనో రియల్ హీరో.
అయితే, ఇప్పుడు సోనూసూద్ మహా రాజకీయాల్లోకి రాబోతున్నారా…? రాజకీయ ఉద్దండులైన శరద్ పవార్ ఎన్సీపీలో చేరబోతున్నారా…? అన్న చర్చ సాగుతుంది. ఇందుకు బలం చేకూర్చేలా సోనూసూద్ పవార్ తో భేటీ అయ్యాడు. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీయేనని ఆయన ప్రకటించినా… పవార్ తో భేటీ అంటే ఎదో ఉందన్న చర్చ సాగుతుంది. మరోవైపు ఇటీవలే ముంబై మున్సిపల్ అధికారులు సోనూసూద్ పై కేసు నమోదు చేశారు. తన ఇంటిని అక్రమంగా హోటల్ గా మార్చారని కేసు నమోదు చేయగా… పవార్ సహాయం కోసం సోనూసూద్ కలిశారా…? అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది.