వివాదాస్పద నటి శ్రీరెడ్డి, దగ్గుబాటి అభిరాం ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన రచ్చ తర్వాత నేరుగా దగ్గుబాటి అభిరాంను టార్గెట్ చేయని శ్రీరెడ్డి ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా శివాలెత్తిపోతూ వీడియో విడుదల చేసింది.

తనకు అలవాటైన బూతు పురాణంతోనే అభిరాంపై శ్రీరెడ్డి మండిపడింది. దేవుడున్నాడ్రా… ఉన్నాడు… అభి నీకు గుర్తుందా నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడ్ని, సురేష్ బాబు కొడుకుని, రామానాయుడు మనవన్ని నువ్వో ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్ వి, నీదో డొక్కు కారు అంటూ అన్నావే ఈరోజు నీ కారుకు ఆక్సిడెంట్ అయినట్లుంది. దేవుడున్నాడ్రా… ఎప్పుడూ మిడిసిపడకు, డబ్బు,అందం, పేరు ఏదీ శాశ్వతం కాదు మంచితనమే శాశ్వతం అంటూ వీడియో రిలీజ్ చేసింది. నేను ఉత్తమురాలిని కాకపోవచ్చు కానీ నేను నీకు చెప్పిన అంశాల్ని పాటిస్తున్నానంటూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టింది.
హైదరాబాద్ మణికొండలో అభిరాం కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు దెబ్బతిన్నాయి. మల్లెమాల ప్రొడక్షన్స్ హౌజ్ దగ్గర ఈ జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.