అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు.పవన్ అలా అనడం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు సూచించారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలంతా దిశ ఘటనలో నిందితులకు ఉరి వేయాలని అంటే, పవన్ కళ్యాణ్ భిన్నంగా మాట్లాడి విమర్శలకు గురయ్యారని చెప్పుకొచ్చారు సుమన్.