భారత్‌లోని పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నా.. దేశవ్యాప్తంగా మాత్రం కరోనా వైరస్ ఉధృactor sunnతి నిలకడగానే కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36 వేల 604 మందికి ఈ మహమ్మారి సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 95 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం లక్షా 38 వేల 122 మంది ఈ వైరస్ కారణంగా కన్నుమూశారు.
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉన్నప్పటికీ.. రికవరీ రేట్ కూడా ఆశాజనకంగానే ఉంది. ఈ వ్యాధి బారినపడిన వారిలో ఇప్పటికే 89.32 లక్షల మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4.28 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా వైరస్ బారినపడ్డారు. నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా సన్నీడియోల్ ఉన్నారు సన్నీడియోల్‌కు ఇటీవలే భుజానికి ఆపరేషన్ జరిగింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో విశ్రాంతి తీసుకుంటున్నారు.