బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్.. శివసేన గూటికి చేరారు.ముంబైలో ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు శివసేన కండువా కప్పుకున్నారు.
ముందస్తు హామీతోనే ఉర్మిళ శివసేనలో చేరినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ నామినేట్ చేసే 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఊర్మిళ పేరు కూడా ఉందని తెలుస్తోంది.