తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవల మార్చి 17వ తేదీన విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలను అఖిల భారత హిందూ మహాసభ ఖండించింది.
హిందూ ఆలయాల్లో ఆగమ నియమాలను అనుసరించి చేసే కైంకర్యాలను కించపరుస్తూ మాట్లాడటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఓ లేఖ కూడా పంపింది. ఇక ఇదే విషయమై నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.