హీరో విశాల్.ప్యాషనేట్ ఫిలిం మేకర్. తన సినిమాలతో సినీప్రియులకు బెటర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి అనుక్షణం శ్రమించే హీరోలలో విశాల్ ఒకడు. తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన ఇస్తాడు. అంతేకాదు యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నటించేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్లలో ఆయన గాయపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నారు.
షూటింగ్ లో అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచి వెళ్లింది.దీంతో, త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.ఈ ఘటనలో ఎవరికీ గాయం కాలేదు.
దీనిపై విశాల్ స్పందిస్తూ..క్షణకాలంలో, కొన్ని ఇంచుల దూరంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని భగవంతుడికి ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నామని తెలిపాడు.