సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ అయిన పాత్రలు చేయాలి అంటే కచ్చితంగా దమ్ము ఉండాలి అంటారు. అదే సమయంలో అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఇలా అదృష్టం లేక ఎన్నో సినిమాలను కొందరు వదులుకున్న మాట వాస్తవం. ఇక తమకు ఆ పాత్ర విధానం నచ్చక వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగులో అలా మంచి పాత్రలు వదులుకున్న వాళ్ళను ఒకసారి చూస్తే…
Also Read:లాస్ట్ డే భీమ్లా నాయక్ సెట్ లో క్రిష్, హరీష్ శంకర్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సూపర్ హిట్ అయిన రేలంగి మావయ్య పాత్రను ముందు రజనీ కాంత్ ను అడగగా ఆయన వద్దన్నారు.
రంగస్థలంలో… అనసూయకు మంచి పేరు తీసుకొచ్చిన రంగమ్మత్త పాత్రను ముందు రాశిని అడగగా ఆమె వద్దని చెప్పారు.
బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు గాను ముందు శ్రీదేవిని అడగగా ఆమె రిజెక్ట్ చేసారు.
అరవింద సమేత సినిమాలో జగపతి బాబు వైఫ్ గా లయని అడగగా ఆమె చేయలేను అని చెప్పారు.
జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్రకు గాను ముందు బాలకృష్ణ ను అడగగా ఆయన క్కూడా రిజెక్ట్ చేసారు.
ఆగడు సినిమాలో సోను సూద్ పాత్రకు గాను ముందు ప్రకాష్ రాజ్ ని అడగగా ఆయన రిజెక్ట్ చేసారు.
గోవిందుడు అందరి వాడెలే సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు గాను తమిళ నటుడు రాజ్ కిరణ్ ను అడగగా ఆయన తిరస్కరించారు.
నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు పాత్రకు గాను అరవింద్ స్వామిని అడగగా ఆయన వద్దన్నారు.
రంగస్థలంలో ప్రెసిడెంట్ గారు పాత్రకు గాను ముందు రాజశేఖర్ ను అడగగా ఆయన చేయలేనని చెప్పారు.
బాలివుడ్ లో సూపర్ హిట్ అయిన పద్మావతి సినిమాలో రావల్ రతన్ సింగ్ పాత్రకు గాను ముందు ప్రభాస్ ను అడగగా బిజీ షెడ్యూల్ తో చేయలేనని చెప్పాడు.