ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే ఎవరి చేతిలో నైనా ఉంటుంది. అక్కడ అదృష్టం ఎలా తిరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రే కొంతమంది స్టార్డమ్ తెచ్చుకుంటారు. మరికొంతమంది దీన స్థితికి చేరుకుంటారు. ఇకపోతే సీనియర్ నటి లక్ష్మి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మురారి, నిన్నే పెళ్లాడతా, మిధునం ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. వీటితోపాటు చాలా సినిమాలలో నటించింది లక్ష్మి. లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా ఇండస్ట్రీలోకే ఎంట్రీ ఇచ్చారు.
ఈమె 200 కు పైగా చిత్రాలలో నటించారు. అయితే హీరోయిన్ అవకాశాలు లేని సమయంలో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది ఐశ్వర్య. ఇకపోతే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి తెలిపింది. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని… దీంతో ఇంటింటికీ వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవకాశాలు లేకపోవడంతో ఎలాంటి పని లేదని, ఆదాయం కూడా లేదని దేనితో ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని చేయాల్సి వస్తుందని అందుకే సబ్బులు విక్రయిస్తున్నానని అన్నారు.
బేబీ షామిలి…ఇలా మారిపోయింది ఏంటి?
మంచి వేతనం ఇస్తే పాచి పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు అప్పులు లేవని, ఇతర సమస్యలు కూడా లేవని అన్నారు. నా కాళ్ళ పై నేను నిలబడి జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నానని యోగ సాధన వల్ల ఒక్కపూట మాత్రమే తింటున్నా అని అన్నారు.
నా రాత మారాలంటే టీవీ సీరియల్స్ కావాలని… నేను బతికింది సీరియల్స్ ద్వారానే అని అన్నారు. నాకు సినిమాలు అన్నం కూడా పెట్టలేదు, బుల్లితెర మాత్రమే అన్నం పెట్టింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఐశ్వర్య.