మొన్నామధ్య … ఒక పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ లో అభ్యర్థుల పేర్లకు బదులు ఏపీ, తెలంగాణ అంటూ వచ్చాయి. వాటిని చూసే విద్యార్థులు షాక్ అవ్వగా … అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ధన్ బాద్ లోని బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ ఓ పీజీ విద్యార్థినికి షాక్ ఇచ్చింది. BBMKUలో PG సెమిస్టర్-2 పరీక్ష ఉన్న నేపథ్యంలో హాల్ టికెట్ ప్రింటవుట్ కోసం వెళ్లిన కాజల్ కుమారి అనే విద్యార్థిని… తన అడ్మిట్ కార్డులో ఉన్న ఫొటో చూసి షాక్ కు గురైంది.
అందులో అప్లికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి.. కానీ ఫొటో దగ్గరికి వచ్చేసరికి మాత్రం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ చిత్రం ఉంది. ఇది గమనించిన కాజల్ తనను ఎగ్జామ్ రాసేందుకు అనుమతించరనే ఆందోళనతో విషయాన్ని యూనివర్సిటీ సిబ్బందికి తెలియజేసింది.
ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు సాంకేతిక లోపంగానే ఇలా జరిగినట్టుగా చెప్పారు. దీనిపై విచారణ చేస్తామని.. విద్యార్థినికి పరీక్షకు ఎలాంటి అడ్డంకు రాకుండా చూసుకుంటామని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
అయినా ఫారం నింపేవరకే తమ పని అని, అడ్మిట్ కార్డుపై ఫొటోలు, సంతకాలు అప్ లోడ్ చేయడం విశ్వవిద్యాలయం చేయదని చెప్పారు. ఇది యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర అన్న అధికారులు… విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.