నువ్వు నేను సినిమా హీరోయిన్ అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొత్త హీరోయిన్ల రాక కూడా పెరిగిపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవడంతో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి ని వివాహం చేసుకుంది.
కాగా పెళ్లయిన ఏడేళ్లకు ఈ రోజు ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అనిత కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శెట్టి, అనిత దంపతులకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలుపుతున్నారు.