మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనూ ఇమాన్యుల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టింది ఈ భామ. కానీ ఆ రెండు సినిమాలు కూడా పరాజయాన్ని మూటకట్టుకోవడం తో ఈ అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు. చిన్న చిన్న చిత్రాలు వచ్చినప్పటికీ అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలతో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ అమ్మడు ఆఫర్లు లేకపోవడంతో తన రెమ్యునరేషన్ ను చాలావరకు తగ్గించుకుందట. ఒక సినిమాకు 40 నుంచి 45 లక్షల మధ్య ఓకే చెప్పడానికి రెడీగా ఉందట.మరి అందం నటన అని ఉన్నప్పటికీ అను హిట్ కొట్టి లేకపోతుంది. ఇప్పుడు ఏకంగా తన రెమ్యూనరేషన్ తగ్గించు కోవడం వల్ల ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.