అనుష్క ఏంటీ… బుల్లితెరపై ఎంటీ అనుకుంటున్నారా…? అవును. మాములుగా అయితే పెద్ద పెద్ద ఈవెంట్స్‌కు అటెండ్ అయ్యే ఈ జేజమ్మ… ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనుంది. జేజమ్మగా, ప్రభాస్ సరసన హాట్ హీరోయిన్‌గా, బాహుబలిలో వీర వనితగా అన్ని రకాల పాత్రలకు న్యాయం చేసిన ఈ అమ్మడు ఈ ఉగాదికి తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది.
అయితే… అనుష్క ఏదో సీరీయల్, గేమ్ షో చేస్తుంది అనుకుంటే పొరపాటే. అతి త్వరలో తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది పండగ రాబోతుంది. ఈ పండగ స్పెషల్ కోసం బాబుగారి ఇంట్లో బుట్ట బోజనం అంటూ ఓ ఛానల్ ప్రత్యేక షో చేస్తుండగా… ఆ షోలో అనుష్క స్పెషల్ గెస్ట్‌గా రాబోతుంది.
అంతేకాదు ఈ షోలో హాట్ యాంకర్ అనసూయ… ఇండియన్ ట్రేడిషినల్ డాన్స్‌తో అలరించబోతుండగా…. నాగబాబు కూతురు నిహారిక కూడా ఉగాది పచ్చడతో అలరించనున్నారు.